పవన్ కళ్యాణ్ పై చెప్పు దాడి

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఖమ్మంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఖమ్మం పట్టణంలోకి పవన్ కాన్వాయ్ ప్రవేశిస్తుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడి చేశారు. పెన్ టాప్ కారులో అభిమానులకు అభివాదం చేస్తూ వెళుతున్న పవన్ ని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆ సమయంలో నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసరడంతో అది పవన్ కారుపై పడింది. దీంతో పవన్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమై భద్రత ఇంకా కట్టుదిట్టం చేశారు.