పవన్‌కు వీహెచ్ సూటి ప్రశ్న...

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణ యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పవన్.. తెలంగాణ ఉద్యమం, కాంగ్రెస్ నేతలతో పాటు పలు విషయాలపై మాట్లాడారు. మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని యుద్ధానికి జనసైన్యంతో సిద్ధంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పవన్ మెచ్చుకున్నారు. దీంతో ఎప్పటిలాగే పవన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సీఎం కేసీఆర్ తాట తీస్తానన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు తెలంగాణలో తిరుగుతున్నాడని ఆయన ఆరోపించారు. ‘ సీఎం అంతా బాగా చేస్తుంటే నువ్వు తిరుగుడెందుకు?’ అని పవన్‌కు వీహెచ్ సూటి ప్రశ్న సంధించారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే ఆంధ్రాలో తిరగాలని ఆయన సవాల్ విసిరారు.