ఏం పీక్కుంటారో పీక్కోండి...

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపుతూ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. చాలా ఆవేశంగా మాట్లాడారు. అంతేకాదు చాలా మందికి కౌంటర్ ఇచ్చారు కూడా. తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై స్పందిస్తూ.. ఊరుకుంటున్నాను కదా అని విమర్శలు చేస్తే బావుండదని.. తాను ఏం చేయగలనో చూపిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతవరకు చాలా నిజాయతీగా ఉన్నాను.. ఇంకా నిజాయతీగా ఉండాలంటే తన వల్ల కాదని.. అయినా కొంత మంది కోడిగుడ్డుపై ఈకలు పీకాలని ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలా పీకాలనుకుంటే పీకవచ్చని, తాను ఏం పీకగలనో చూపిస్తానని ఆయన ఆవేశంగా అన్నారు. అలాగే గతంలో కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ నేనెవరో వాళ్లకి తెలియకపోవచ్చు...కానీ బీజేపీ ఎంపీ గంగరాజు, హరిబాబు, అవంతి శ్రీనివాస్, ఆశోక్ గజపతి రాజు తనకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.