మై ‘ఎవ్రీ డే హీరో' అతనే

 

లండన్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అవార్డు ప్రదానం జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన పవన్ తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తాను ఓ వ్యక్తితో దిగిన ఫొటోని పోస్ట్ చేసి  ‘ఎవ్రీ డే హీరో’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? హకీం అనే బంగ్లాదేశీ. పవన్ అతని గురించి... బంగ్లాదేశీ అయిన హకీం లండన్‌లో ఎప్పుడో స్థిరపడ్డారని... తానెప్పుడు లండన్ వెళ్లినా హకీం తనను కారులో లండన్ మొత్తం తిప్పి చూపిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆయన తనతో ఎప్పుడూ ఏ విషయాలు మాట్లాడలేదని...కానీ.. తన రాజకీయ ప్రస్థానం గురించి తెలిసి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారని.. మహిళల రక్షణ, గృహ హింస, సీనియర్ సిటిజన్ల కోసం జాగ్రత్తలు వంటి వాటిపై హకీం ఇచ్చిన సలహాలు చాలా విలువైనవని, వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని పవన్ పేర్కొన్నారు. ఆ సలహాలను తాను పాటిస్తానని హకీంకు మాటిచ్చానని పవన్ తెలిపారు. ఆఖరిలో ఆయన చెప్పిన మాట నన్నుకదిలించింది..  ఏ మతమైనా హింసను ప్రోత్సహించదని హకీం చెప్పిన మాటలు నన్ను కదిలించాయని చెప్పాడు.