సినిమాకు పైరసీ..చేనేతకు పవర్‌లూమ్స్
Published on: Mon Feb 20, 2017 5:56PM
.jpg)
సినీ పరిశ్రమకు పైరసీ ఉన్నట్లే చేనేత రంగానికి పవర్‌లూమ్ పెద్ద అడ్డంకిగా మారిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గుంటూరు సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద జరిగిన చేనేత గర్జన సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. పవర్ లూమ్ పేరుతో చట్టాలను ఖూనీ చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రభుత్వాలు చేనేతకు అండగా ఉంటామని హామీ ఇచ్చాయాని కాని ఇల్లు అలకగానే పని పూర్తికాదని, దానిని పూర్తి చేయాల్సిన ఇరు ప్రభుత్వాలపై ఉందన్నారు. చేనేత కార్మికుల ప్రతిభకు నగదు ప్రొత్సాహకాలు ప్రకటించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.


