తనను విస్తరాకులు ఏరుకునేవాడని అన్నారు
Published on: Mon Feb 20, 2017 5:40PM

నిధులిచ్చేవారిని మానేసి విస్తరాకులు ఏరుకునే వాడిదగ్గరకు వెళ్తున్నారని కొందరు నేతలు తనను విమర్శిస్తున్నారని..అయినా తనకు ఎలాంటి బాధాలేదన్నారు..అలాంటి వ్యక్తులు లేకుండా సమాజం శుభ్రంగా ఉండదని తనను విమర్శించిన వారు గుర్తించాలని పవన్ సూచించారు. ఒక వ్యక్తి చేసే పనికి గౌరవమివ్వకుండా రాజకీయ నాయకులు మాట్లాడితే..వారు కొన్ని పనులు, కొన్ని వర్గాలను కించపరిచేవారవుతారన్నారు. ప్రజాసేవ, సమాజసేవ చేస్తామని చేస్తామని చెప్పే రాజకీయ నాయకులే ప్రజలను అగౌరవపరిస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ పవన్ ప్రశ్నించారు.


