చివరి శ్వాస వరకు చేనేతకు అండగా ఉంటా
Published on: Mon Feb 20, 2017 5:31PM

చివరి శ్వాస వరకు చేనేత కార్మికులకు, చేనేత పరిశ్రమకు అండగా ఉంటానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ సమీపంలో జరుగుతున్న చేనేత గర్జన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాను అధికారం ఆశించి రాజకీయాల్లోకి రాలేదన్నారు. తనతో పాటు స్కూల్‌లో చదువుకున్న చేనేత కార్మికుల పిల్లలు పస్తులుండటం తనకు తెలుసునని ఆయన చెప్పారు. పలు సంస్థలు, వస్తువులకు బ్రాండింగ్ చేస్తే తనకు కోట్ల రూపాయలు వస్తాయని కానీ తనకు కోట్లు అక్కర్లేదని..చేతి వృత్తులపై ఆధారపడిన వారికి అండగా ఉంటే వచ్చే తృప్తి చాలన్నారు.


