చేనేత గర్జన సభలో పవన్
Published on: Mon Feb 20, 2017 4:43PM
.jpg)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ సమీపంలో జరుగుతున్న చేనేత గర్జన సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలీ నేతలు, చేనేత కార్మిక సంఘం నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న కార్మికులకు నిమ్మరసం ఇచ్చి వారిచేత దీక్ష విరమించారు. పవన్ సభా ప్రాంగణానికి రావడంతో అభిమానులు ఆయన్ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు.


