పవన్ కళ్యాణ్‌తో రాజధాని రైతుల భేటీ
Published on: Mon Feb 20, 2017 4:03PM
.jpg)
సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు భేటీ అయ్యారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ సమీపంలో జరుగుతున్న చేనేత గర్జన సభలో పాల్గొనేందుకు గన్నవరం చేరుకున్న పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని హాయ్‌ల్యాండ్‌లో రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఫ్లాట్ల కేటాయింపు, పరిహారం విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఇళ్లు, పొలాలు ఇలా సర్వం రాష్ట్రం కోసం త్యాగం చేశామని కాని తమను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు.


