TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గన్నవరం చేరుకున్న జనసేనాని

Published on: Mon Feb 20, 2017 3:43PM

గుంటూరు ఏఎన్‌యూ వద్ద జరుగుతున్న చేనేత సత్యాగ్రహం-చేనేత ఐక్యగర్జనలో పాల్గొనేందుకు ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గన్నవరం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయనకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ బందోస్తు మధ్య గుంటూరుకు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సత్యాగ్రహనికి రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.