TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గుంటూరులో పవన్ చేనేత సత్యాగ్రహం

Published on: Mon Feb 20, 2017 10:51AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం గత కొద్ది రోజులుగా ఆందోళనలకు వేదికగా మారుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులో భారీ సభ నిర్వహించారు. తాజాగా చేనేత రంగానికి సహకారం అందించాలని..పద్మశాలీలకు రాజకీయంగా ప్రాధాన్యతనివ్వాలని కోరుతూ ఇవాళ గుంటూరు ఏఎన్‌యూ ఎదురు ఖాళీ స్థలంలో చేనేత సత్యాగ్రహం-చేనేత మహాగర్జన సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ సదస్సులో 60 మంది చేనేత కార్మికులు సత్యాగ్రహం చేస్తారు..అనంతరం వీరికి సంఘీభావంగా పవన్ ప్రసంగిస్తారు.