మరో అడుగు ముందుకేసిన పవన్...'దేశ్ బచావ్' పోస్టర్ రిలీజ్

 

ప్రత్యేక హోదా కోసం యువత పోరాడాలని.. యువతకు తాము మద్దతుగా ఉంటామని.. చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో నిరసన కార్యక్రమానికి యువత కదలి రావాలని..ఈ నెల 26న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా కోసం జరగబోయే నిరసన కార్యక్రమానికి ప్రతి ఆంధ్రుడు ఓ సైనికుడై కదలి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి తోడుగా 'దేశ్ బచావ్' పేరిట ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అసలు ఈ పోస్టర్ ను ఫిబ్రవరి 5న విడుదల చేయాలనుకున్నారు...కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు విడుదలచేశారు. అవినీతి, నేర పూరిత అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ ఆల్పమ్ ఉంటుందని..జనసేన యూ ట్యూబ్ ఛానల్ లో పాటలు విడుదల చేస్తామని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో తెలిపారు. అంతేకాదు హోదా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలంటున్నారు.