చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ.. భూసేకరణ వివరణ
Published on: Sat Aug 22, 2015 1:06PM

భూసేకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ట్విట్టర్ లో ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. రైతుల నుండి భూములు తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ చంద్రబాబును కోరారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రేపు పవన్‌కల్యాణ్‌తో భేటీ కానున్నట్టు సమాచారం. భూసేకరణ గురించి.. ఏపీలో ఉన్న సమస్యల గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు వివరించనున్నట్టు తెలుస్తోంది. కాగా రేపు ఉదయం చంద్రబాబు పార్టీ నాయకులతో విజయవాడలో సమావేశమయి భాసేకరణ, కార్యాలయాల తరలింపు తదితర అంశాలపై చర్చించి అనంతరం సాయంత్రం విజయవాడ నుండి హైదరాబాద్ కు రానున్నారు.


