బన్నీని బద్నాం చేశారు... ఫ్యాన్స్ కు పవన్ వార్నింగ్..

 

అభిమానం ఉండాలి.. కానీ అది పక్కన వాళ్లని ఇబ్బంది పెట్టేదిగా మాత్రం ఉండకూడదు. సాధారణంగా హీరో, హీరోయిన్స్ కు అభిమానులుండటం సహజం. హీరోయిన్స్ తో పోల్చుకుంటే... హీరోలకి లక్షల్లో అభిమానులుంటారు. కేవలం అభిమానించడమే కాదు...ఆరాధిస్తారు, పూజిస్తారు కూడా. తమ ఫేవరేట్ హీరో పేరున సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇది అందరూ సంతోషించాల్సిన విషయం. కానీ ఈ అభిమానం శృతి మించి రాగాన పడితేనే అసలు సమస్య వస్తుంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకుంటారా..? పవన్ ప్యాన్స్ గురించి చెప్పాలంటే ఆ మాత్రం ఉండాలి కదా.

 

నిజానికి అందరి ఫ్యాన్స్ సంగతేమో కానీ.. పవన్ ప్యాన్స్ మాత్రం పవన్ ను దేవుడిగా పూజిస్తారు. ఒకప్పుడు పవన్ ప్యాన్స్ గురించి గర్వంగా చెప్పుకునేవారు. కానీ రాను రాను ఏమైందో తెలియదు కానీ.. వారి ప్రవర్తనతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పవన్ అభిమానుల ప్రవర్తనలతో చాలామంది సినీ సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డారన్న మాట వాస్తవమే. ఇప్పుడు వారి ప్రవర్తన వల్ల పవన్ కే చిరాకు వేసినట్టుంది. అందుకే కాస్త సీరియస్ అయ్యాడు. ఏపీ టూర్ లో ఉన్న పవన్ పలు సభల్లో పాల్గొంటున్నాడు కదా. ఇక అక్కడికి ఆయన అభిమానులు కూడా వస్తున్నారు. ఇంకేముంది.. ఆయన నోటి నుండి ఏమాట వచ్చినా.. అరుపులు, ఒకటే కేకలు. చూసే వారికి కూడా చిరాకు తెప్పించేలా చేశారు. దీంతో “అభిమానం ఉండాలి గానీ, అది ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు” అంటూ తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు.  “ఇక్కడికి రావడం చాలా ఇబ్బంది… బాబులకు బాబు కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేస్తారు, ఇవన్నీ తనకు నచ్చావు…” అంటూ చెప్పుకొచ్చారు. “మీ అభిమానం ప్రజలకు ఇరిటేట్ చేసేలా ఉండకూడదు, ఆనందింపచేసేలా ఉండాలి, మీరు పుట్టిన ఈ గడ్డ మీద గౌరవం ఉంటే, నాపై, జనసేన పార్టీపై కాకుండా, భారత్ మాతాకి జై అని చెప్పండి, మీరు ప్రతిసారి సిఎం సిఎం అంటే నేను ముఖ్యమంత్రిని అయిపోతానా? అరుపులు, కేకలతో మార్పులు రావు, ఆలోచనలతో కూడిన సంస్కరణల వలనే మార్పులు వస్తాయంటూ” పవన్  హిత బోధ చేశాడు.

 

మరి పవన్ చెప్పిన ఈ మాటలే కదా అల్లు అర్జున్ కూడా గతంలో చెప్పింది. ఏ హీరో ఫంక్షన్స్ కి వెళ్లినా అక్కడ పవన్ అభిమానులు హంగామా చేయడం.. వారి గోలకు హీరోలు ఇరిటేట్ అవ్వడం. ఇవన్నీ చూసి ఇది బయటకు చెప్పింది మాత్రం ఒక్క అల్లు అర్జునే. ఏది ఏమైనా కానీయ్ అనుకుని, పవన్ ఫ్యాన్స్ పై సీరియస్ అయ్యాడు. ఇక బన్నీ చేసిన వ్యాఖ్యలకు రియాక్షన్ ఏ రీతిలో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత బన్నీ వ్యాఖ్యలకు మరికొందరు కూడా సమర్ధించినా పవన్ కళ్యాణ్ అభిమానుల తీరులో మాత్రం పెద్దగా మార్పు లేకపోదు సరికదా.. బన్నీని ఏడాదిపాటు బద్నాం చేసేశారు. ఇప్పుడు ఏకంగా పవన్ కే చిరాకు తెప్పించి... క్లాస్ పీకించుకున్నారు. అప్పుడు బన్నీ మాట వినలేదు.. ఇప్పుడు తాము పూజించే పవనే చెప్పిన తరువాత.. మారతారో..? లేదో చూద్దాం. ఏది ఏమైనా ఈ విషయాన్ని అందరికంటే ముందు బన్నీ ధైర్యంగా చెప్పడం ఎంతైనా గ్రేటే...