పాపం పవన్.. బుక్కయ్యాడా..!

 

జనసేన అధినేత పవన కళ్యాణ్ ఏపీ టూర్ లో చాలా పవర్ ఫుల్ స్పీచ్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. గత మూడు రోజులుగా కార్యకర్తలతో, ఇతర సమావేశాల్లో పాల్గొంటున్న పవన్ పలు అంశాలపై స్పందిస్తూ... కౌంటర్ల మీద కౌంటర్లు విసిరారు. తన మీద విమర్శలు గుప్పించిన వాళ్ల మీద... కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, ప్రతిపక్ష నేత జగన్ మీద అయితే కాస్త ఎక్కువగానే సెటైర్లు విసిరారు. అంతేకాదు మునుపెన్నడూ లేని విధంగా చిరంజీవి గురించి, చిరంజీవి మంచితనం గురించి.. చిరంజీవిని మోసం చేశారని.. ఇంకా ప్రజారాజ్యం గురించి చాలా మాట్లాడాడు. ఇంకా వారసత్వ రాజకీయాలు గురించి.. పాదయాత్రల గురించి, కులాల గురించి, రిజర్వోషన్ల గురించి, పోలవరం గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశాడు.

 

అయితే ఇక్కడి వరకూ  బాగానే ఉంది. పవన్ తన మనసులో బాధను ఒక్కసారిగా బయటపెట్టాడు..అయితే దీనివల్ల పవన్ తన సెల్ఫ్ గోల్ తానే చేసుకున్నాడు అంటున్నారు. ఎందుకంటే.. పవన్ పాదయాత్ర గురించి మాట్లాడాడు. దీంతో...  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను కలవడానికి అనేక మార్గాలను ఎంచుకుంటారు..అటువంటి వాటిలో 'పాదయాత్ర' ఒక మార్గం..దీనిలో తప్పుపట్టడానికేముంది అంటున్నారు. అంతేకాదు అదే విధంగా ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి కావాలని ఆశ పడడం తప్పుని సెలవిచారు...మరి సినీనటుల కుమారులు, తమ్ముళ్లు సినిమా నటులు కావచ్చా...? వారసత్వం ఉండకూడదని చెప్పిన 'పవన్‌' మరి సినీ వారసత్వం ఉండాలని భావిస్తున్నారా..? ఒకే ఇంటిలో డజన్‌కు పైగా హీరోలను పెట్టుకుని వారసత్వం గురించి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నమ్ముతారా..? అని అంటున్నారు.

 

ఇంకా కులం గురించి కూడా పవన్ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాడు. తనకు ఒక కులం ఆపాదించవద్దని, తాను ఏ కులానికి చెందిన వాడిని కాదని, ఇంకోసారి తనను ఒక కులానికి చెందినట్టు కథనాలు రాస్తే ఊరుకోనని గట్టిగానే చెప్పాడు. దీనికిగాను...నిన్నటి దాకా తనకు కులం లేదని డప్పుకొంటుకున్న 'పవన్‌' ఈ రోజు 'కాపు'లకు ఐదు శాతం రిజర్వేషన్లు చాలవని, వారికి 15శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసి తనకు ఉన్న కులతత్వాన్ని బహిరంగంగా చాటుకున్నాడని అంటున్నారు. సామాజికవర్గం విషయంలో స్పందించిన తీరుతో అవన్నీ నోటిమాటలేనని అంటున్నారు. అదే విధంగా 'పోలవరం' ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగలేదని నిరూపించాలంటే..అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలట. దీనిలో ఏమైనా హేతు బద్దత ఉందా..? అవినీతి జరిగితే..ఎక్కడ జరిగిందో తేల్చి చెప్పి..అది నిరూపించాలి..కానీ..ఢిల్లీకి తీసుకెళ్లు..అంటూ పనికి మాలిన సలహాలు ఇవ్వడం ఎందుకు.. అన్నిటి కంటే విచిత్రమైన డిమాండ్‌ కేంద్ర రక్షణ మంత్రి 'నిర్మలాసీతారామన్‌', ఆమె భర్త ప్రభుత్వ సలహాదారు 'పరకాల ప్రభాకర్‌'లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయినందున రాజీనామా చేయాలట...? సరే...వారు విఫలమయ్యారు..అనుకుందాం..మరి..'పవన్‌' అన్న..కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కదా..కాంగ్రెస్‌ అడ్డంగా ఆంధ్రాను చీల్చింది..మరి...అప్పుడు ఎందుకు 'చిరంజీవి' రాజీనామా చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆవేశంగా మాట్లాడిన పవన్.. తన సెల్ఫె గోల్ తానే చేసుకున్నాడు అంటున్నారు.