పవన్ పాదయాత్ర.. కేంద్రమే టార్గెట్...

 

ప్రశ్నించడానికే  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే రెగ్యులర్ గా ప్రశ్నించకపోయినా... అప్పుడప్పుడు.. ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. దానికోసం ఇప్పటినుండే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు కూడా. ఇక అక్కడక్కడ పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ నిర్మాణం మీద పూర్తిగా దృష్టి పెట్టడమే కాదు త్వరలో జనంలోకి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే పాదయాత్ర చేయాలని చూస్తున్నాడు.  జనవరి లేదా ఫిబ్రవరి లో ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర మొదలు పెట్టడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నాడు. పాదయాత్ర రూట్ మ్యాప్, షెడ్యూల్ కి సంబంధించి జనసేన కోర్ టీం తో పవన్ విస్తృతంగా చర్చిస్తున్నారట. ఇప్పటికే పాదయాత్ర కు సంబంధించి ప్రాధమికంగా ఓ అవగాహనకు వచ్చారట.

 

అయితే ఈ పాదయాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే...పవన్ పాదయాత్రలో.. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలు గురించి మాత్రమే ప్రధానంగా దృష్టి పెడుతున్నారట. ప్రత్యేక హోదా , పోలవరం, నిధులు కేటాయింపులకు సంబంధించి మోడీ సర్కార్ మోసం చేసిన ప్రతి విషయాన్ని పవన్ జనంలోకి తీసుకెళ్లే అవకాశాలు వున్నాయట. పాదయాత్ర చేసేటప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమ రూపంలో ఆంధ్రుల మనోభావాలు వివరించే ఆలోచన కూడా ఉందట. మొత్తానికి ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అని చెప్పిన పవన్ ఇన్ని రోజులకు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడానికి రెడీ అవుతున్నాడు. మరి పవన్ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో.. డైరెక్ట్ గా కేంద్రంతోనే పోటీకి దిగుతున్నాడు.. కేంద్రాన్నే ప్రశ్నించడానికి సిద్ద పడుతున్నాడు...మరి ఏం జరుగుతుందో చూద్దాం..