పవన్‌స్టార్ భార్య రేణూదేశాయ్ ఎక్కడ ?
Published on: Thu Jul 5, 2012 11:51AM
గతనెల్లో జరిగిన చిరంజీవి కుమారుడు చరణ్‌తేజ, ఉపాసన పెళ్లిలో చాలామంది కళ్లు పవన్‌స్టార్‌తో పాటు ఆతని భార్య ఒకప్పటి హీరోయిన్ రేణూదేశాయ్, కొడుకు అకిర, కూతురు ఆధ్య కోసం ఎంతగానో వెతికాయి. కాని వారి ఆచూకి కనిపించలేదు. కారణం ఏమిటా అని కూపీ లాగితే చాలా కధ బయటికి వచ్చింది.
రామ్‌చరణ్ నటించిన ఆరెంజ్ కు ప్రొడ్యూసర్ చిరంజీవి సోదరుడైన నాగబాబు. ఆ సినిమాకు 38 కోట్లు ఖర్చయింది. సినిమా ప్లాప్ వల్ల నాగబాబుకు కేవలం 20 కోట్లు మాత్రమే వచ్చాయి. దాంతో నాగబాబు అన్నయ్య చిరంజీవి దగ్గరకెళ్లి పరిస్థితిని వివరించి ఆదుకోపోతే ఆర్ధికంగా తను చాలా నష్టపోవలసి వస్తుందని మొరపెట్టుకున్నాడు. చిరంజీవి మాత్రం కూల్‌గా నీకు తెలుసుకదా చరణ్ అప్‌కమింగ్ యాక్టర్ అంత పెట్టుబడి ఎందుకు పెట్టావ్ అనడంతో నాగబాబు తమ్ముడు పనన్‌కల్యాణ్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా వివరించాడు. అంతే పవన్‌కల్యాణ్ అన్న నాగబాబుకు అభయమిచ్చి డబ్బులు సర్దుబాటు చేయటంతో నాగబాబు గండం నుండి గట్టేక్కారు.
కాని రేణూదేశాయ్ గొడవపెట్టుకుని ఉన్న డబ్బంతా ఇలా తగలేస్తే పిల్లల సంగతేంటని, ఇప్పటికే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు స్వంత ఖర్చులతో తిరిగింది చాలదన్నట్లు ఇంకా ఎంత పాడు చేస్తావని ఆగ్రహంతో ప్రశ్నించినట్లు తెలిసింది. ప్యాన్స్ పార్టీటికెట్ తీసుకుని ఓడిపోయి చిరంజీవి దగ్గరకు ,అల్లూ అరవింద్ దగ్గరకు వెళ్లి ఆదుకోమంటే వాళ్లు మోహంచాటేసారు. అప్పుడుకూడా అన్నకు చెడ్డపేరు తేకూడదని మీరే ఇచ్చారు. రేపు మన సంగతేంటి అని ఆమె గొడవచేశారు. అసలు నన్ను కాని, నాపిల్లలను కాని ఏరోజూ మీ అన్నలు పట్టించుకోలేదు. డబ్బంతా మాత్రం వారికే ఖర్చు చేస్తున్నారని వాదించేసరికి రేణూదేశాయ్‌ని కూల్‌చేయటానికి పవన్‌కల్యాణ్ హైదరాబాద్ ఇంటిని భార్యపేరున రిజిస్టర్ చేయించాడు. తర్వాత ఆమెకోరిక ప్రకారం పూనేలో ఒక ఇంటిని కొనిపెట్టారు. ప్రస్తుతం రేణూదేశాయ్ పిల్లలతో అక్కడ వుంటున్నారు. పవన్‌కల్యాణ్ షూటింగులు లేని సమయంలో అక్కడకు వెళ్లివస్తున్నారు.. చరణ్ ఉపాసన నిశ్చితార్ధానికి పవన్‌కల్యాణ్ లక్జరీకారు ఆడీని బహుమతిగా ఇవ్వటం తెలిసిందే....ఏది ఏమైనా తమ్ముడు తమ్ముడే.......


