పవన్, కేసీఆర్ ని కలిసింది అందుకట.. కత్తిగారు బలే చెప్పారు...


పవన్ ఏం చేసినా.. అభిమానుల కంటే ముందుగా అప్ డేట్ చేస్తున్న మువీ క్రిటిక్ అనే ట్యాగ్ లైన్ కట్టుకున్న కత్తి మహేశ్.. తాజాగా పవన్, కేసీఆర్ ల భేటీపై కూడా స్పందించాడు. పవన్, కేసీఆర్ ల భేటీపై ఒకపక్క అటు ఏపీలోనూ... ఇటు తెలంగాణలోనూ హాట్ హాట్ గా చర్చలు జరగుతూనే ఉన్నాయి. అయితే కేసీఆర్,పవన్ భేటీపై స్పందించిన చాలా మంది...ఏదో రాజకీయాంశాల నేపథ్యంలోనే కలిసుంటారని అనుకుంటున్నారు. అయితే వీరిద్దరి భేటీపై అందరికంటే భిన్నంగా స్పందించాడు కత్తి మహేష్. పవన్‌ కళ్యాణ్‌, కేసీఆర్‌ల భేటీ వెనుక ఉన్న కారణంను కత్తి మహేష్‌ విశ్లేషించాడు. కొన్నాళ్ల క్రితం వరకు కేసీఆర్‌ అంటే విరుచుకు పడ్డ పవన్‌ కళ్యాణ్‌ ఉన్నట్లుండి ఎందుకు ఇలా వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పాడు అనే విషయం అందరు ఆలోచించాలని... కేసీఆర్‌ను పవన్‌ రాజకీయ ఉద్దేశ్యంతో కలవలేదని, సినిమా కోసం కలిశాడు అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలో అజ్ఞాతవాసి సినిమా విడుదలకాబోతుంది కదా.. అందుకే పవన్ కళ్యాణ్ కేసీఆర్ ను కలిశారని.... గతంలో పవన్‌ నటించిన సినిమాలకు ప్రీమియర్‌ షోల అనుమతి ఇవ్వలేదు. ఇక ఈసారి కూడా అలాగే జరిగితే నిర్మాత నష్టపోవాల్సి వస్తుందని, అందుకే ప్రీమియర్‌ షోలకు అనుమతి ఇస్తారనే ఉద్దేశ్యంతో ఇలా కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఉంటాడు అంటూ కత్తి మహేష్‌ చెప్పుకొచ్చాడు. మరి ఎప్పుడూ పవన్ ను ఏదో ఒక రకంగా విమర్సించే పని పెట్టుకున్న కత్తి మహేష్.. ఇప్పుడేంటో.. కాస్త సాఫ్ట్ గా రియాక్ట్ అయ్యాడు. మరి అసలు వీరిద్దరి భేటీలో ఆసలు ఆంతర్యం ఏముందో తెలియదు కానీ.. కత్తి మహేష్ మాత్రం మొత్తం తనకు తెలుసు అన్న రేంజ్ లో చెప్పారు. అసలు నిజం ఏంటో వారిద్దరికే తెలియాలి.