పవన్, కేసీఆర్ భేటీపై వర్మ సెటైర్లు.. రాజకీయాలంటే ఇవే..

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని నిన్న సాయంత్రం కలిసిన సంగతి తెలిసిందే కదా. నిన్న సాయంత్రం కేసీఆర్ నివాసంలో పవన్  ఆయన్ని కలిశాడు. దీంతో ఇప్పుడు ఇది అటు ఏపీ, ఇటు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. అందరి సంగతేమో కానీ.. అన్నీ విషయాలకు స్పందించే వర్మ ఇక వీరిద్దరి భేటీ గురించి కూడా తనదైన శైలిలో ట్వీట్లు చేశాడు. ఓ సభలో పవన్ మాట్లాడుతూ ‘ఏయ్.. కేసీఆర్ నీ తాట తీస్తా’ అనగా, ‘ఆడి పేరేందిరా బై’ అని కేసీఆర్ ఓ బహిరంగ సభలో అడుగుతూ కౌంటర్ ఇచ్చిన మాటలను గుర్తుచేస్తూ.. వాటిని యధావిథిగా పోస్ట్ చేసి.. రాజకీయాలంటే ఇలానే ఉంటాయేమో..అవసరం, సమయం రాజకీయ నాయకులను మార్చేస్తుందని, 'జై రాజకీయ నాయకుల్లారా..' అంటూ కేసీఆర్‌కి పవన్ శుభాకాంక్షలు చెబుతున్న ఫొటోను పోస్టు చేశాడు.

ఇక ఈ భేటీపై పవన్ మాట్లాడుతూ..కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికే తాను కలిశానని చెబుతున్నా... వీరిద్దరి భేటీకి రీజన్ వేరే ఉందన్నది పలువురి అభిప్రాయం..