TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అయోమయ౦లో మెగా ఫ్యాన్స్

Published on: Thu Mar 27, 2014 3:48PM

 

 

 

పవన్ కళ్యాణ్ సొంతగా రాజకీయ కుంపటి పెట్టుకుని అన్నయ్యకి, ఆయన పార్టీకి వ్యతిరేకంగా వర్క్ చేస్తూ వుండటంతో ఇప్పుడు చిరు ఫ్యాన్స్ కి చిరు, రామ్ చరణ్ వైపు వుండాలా? లేక పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్ ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్‌కి తమ మద్దతు లేదని చిరు కుటుంబం ప్రకటించడంతో, గురువారం నాడు పవన్ వైజాగ్‌లో నిర్వహించే సభకి వెళ్ళాలా లేక హైదరాబాద్‌లో వున్న రామ్‌చరణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనాలా అని ఫ్యాన్స్ డోలాయమాన స్థితిలో వున్నారు.

 

ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి ఫ్యాన్స్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. అయితే చరణ్ ఫ్యాన్స్ మాత్రం హైదరాబాద్ బయల్దేరారని తెలుస్తోంది. పవన్ వైపే పూర్తిగా మొగ్గు చూపిన కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే వైజాగ్ చేరుకున్నారు. ఏం చేయాలో అర్థంకాని చాలామంది ఫ్యాన్స్ మాత్రం ఇంట్లోనే ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చోవాలని డిసైడైనట్టు తెలుస్తోంది. మొత్తంమీద పవన్ కళ్యాణ్ మీటింగ్ డే, రామ్ చరణ్ బర్త్ డే ఒకేరోజు రావడంతో ఫ్యాన్స్‌ అయోమయానికి గురయ్యారు.