కాస్త ఆ అజ్ఞాతవాసి పేరు చెప్పు పవన్

 

శ్రీవారి ఆభరణాలు అదృశ్యమయ్యాయని రమణదీక్షితులు ఆరోపించడం.. ఈ విషయం నాకెప్పుడో తెలుసు, కొన్నేళ్ల క్రితం ఎయిర్ పోర్ట్ లో కలిసిన ఓ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పారని పవన్ ట్వీట్ చేయడం తెలిసిందే.. అయితే ఈ విషయంపై ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు.. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వేదికగా బీజేపీ, వైసీపీ, జనసేన కుట్ర చేస్తున్నాయని కేఈ మండిపడ్డారు.. పవన్ రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి తేడా తెలుసుకోవాలి.. పవన్ అంటేనే గాలి, గాలి వార్తలు విని వాటిని నిజమనుకొని ప్రజలకి చెప్పడం పవన్ అనుభవరాహిత్యానికి నిదర్శనమని కేఈ అన్నారు.. 'ఓ అజ్ఞాతవాసి, మరో అజ్ఞాతవాసి చెబితే అది నిజమని  నమ్మి చెప్పడం దారుణం.. శ్రీవారి నగలు ప్రత్యేక విమానంలో తరలిపోయాయని మీకు చెప్పిన ఐపీఎస్‌ అధికారి పేరు చెబితే వాస్తవాలు తెలుసుకుంటాం' అన్నారు.. తిరుమల విషయంలో ఆధారాలు చూపకుండా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని.. బీజేపీ, వైసీపీ తానా అంటే పవన్ తందానా అంటున్నారని కేఈ మండిపడ్డారు.