TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భీమ్లా నాయ‌క్ ఓపెనింగ్‌కు కొడాలి, పేర్ని.. అడ్డుకున్న ఫ్యాన్స్‌.. గుడివాడ‌లో హైటెన్ష‌న్‌..

Published on: Fri Feb 25, 2022 11:41AM

కొడాలి నాని, పేర్ని నాని. ఇద్ద‌రు మంత్రులు. భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ డే.. ఫ‌స్ట్ షోకి వ‌చ్చారు. అప్ప‌టికే అక్క‌డికి పెద్ద సంఖ్య‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ త‌ర‌లివ‌చ్చారు. అస‌లే కొత్త థియేట‌ర్‌.. అందులో ప‌వ‌ర్ స్టార్‌ పిక్చ‌ర్‌. మామూలుగా లేదు అక్క‌డ హంగామా. వంద‌లాది మంది పీకే అభిమానులు ఉన్నారు. అంత‌లోనే మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు అక్క‌డ‌కు వ‌చ్చారు. ఇక అంతే. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హంతో ఊగిపోయారు.  జై ప‌వ‌న్‌.. జై జై ప‌వ‌న్‌.. అంటూ ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. జ‌న‌సేన జెండాల‌తో వారి వాహ‌నాలు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, అప్ప‌టికే అక్క‌డ మోహ‌రించి ఉన్న పోలీసులు.. పీకే ఫ్యాన్స్‌ను అడ్డుకున్నారు. మంత్రుల‌ను జాగ్ర‌త్త‌గా పంపించేశారు. 

ఇంత‌కీ, పీకే అంటే ప‌డ‌ని.. ఆ ఇద్ద‌రు మంత్రులు భీమ్లా నాయ‌క్ ఓపెనింగ్‌కు ఎందుకు వ‌చ్చార‌నే డౌట్ రాక‌మాన‌దు. వారు వ‌చ్చింది సినిమా చూసేందుకు కాదు.. గుడివాడ‌లో కొత్త‌నా నిర్మించిన జీ3 భాస్క‌ర్ థియేట‌ర్‌ ఓపెనింగ్‌కు. ఆ థియేట‌ర్‌ను భీమ్లా నాయ‌క్ సినిమాతో ప్రారంభించారు. ఆ కాంప్లెక్స్ ఓపెనింగ్‌కు వ‌చ్చిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఫ్యాన్స్ సెగ త‌గిలింది. జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటు అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను కక్ష పూరితంగా అడ్డుకోవడం దారుణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వచ్చిన తమను అరెస్ట్ చెయ్యడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని పీకే ఫ్యాన్స్‌ మండిపడ్డారు.