పవన్ వెంకీల సినిమా రిలీజ్ డేట్
Published on: Wed Feb 26, 2014 8:57AM

పవన్ కళ్యాణ్, వెంకటేష్ ప్రధాన పాత్రలలో నటించనున్న "ఓ మై గాడ్" చిత్ర తెలుగు రీమేక్ త్వరలో ప్రారంభం కాబోతుంది. అయితే షూటింగ్ ప్రారంభం కాకముందే విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించేసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లలో సురేష్ బాబు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


