TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్, టీడీపీకి మళ్ళీ మద్దతిస్తాడా??...

Published on: Mon Jun 4, 2018 5:57PM

 

పవన్, టీడీపీకి మద్దతా !!.. ఇది అసాధ్యం అంటారా.. ఈ అసాధ్యం సుసాధ్యం అవుతుందనే ఆశ ఇంకా కొందరిలో ఉంది.. ఆ కొందరిలో ఒక్కరే పరిటాల సునీత.. 2014 లో పవన్, టీడీపీతో కలిసి నడిచారు.. తర్వాత విభేదించారు.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.. టీడీపీ నాయకులు కూడా పవన్ మీద అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.. కానీ పరిటాల సునీత కాస్త భిన్నంగా స్పందించారు.. "పవన్ కి కాస్త ఆవేశం ఎక్కువ.. యాత్రల పేరుతో సమయం వృధా చేసుకోకుండా.. టీడీపీతో కలిసి పయనిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది" అని సునీత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.. భవిష్యత్తులో పవన్, టీడీపీకి మద్దతిస్తారో లేదో కాలమే నిర్ణయించాలి...