TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐయాం పాల్‌ ..కేఏ పాల్.. కాబోయే ప్రధానిని!

Published on: Mon Jun 6, 2022 11:28AM

అన్నీ తానే చేయ‌గ‌ల‌ను, ఏద‌యినా త‌న వ‌ల్లే అవుతుంద‌ని చెప్ప‌గ‌ల ధీమా ఎంద‌రికి వుంటుంది?   తాను ఇన్నాళ్లూ గ‌ట్టిగా త‌లుచుకోలేదు గనుక అంద‌రూ ఇష్టంవ‌చ్చిన‌ట్టు రాజ్యం చెలాయిస్తున్నార‌న్న ధీమా మాత్రం కె.ఎ.పాల్‌కే వుంది. అవును మీరు అనుకుంటున్న‌ది క‌రెక్టే.. ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కె.ఎ.పాల్‌. పాల్‌ గారికి చాలా కాలంగా కేవ‌లం విదేశాల్లో సువార్త‌లు వినిపిస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్న వ్య‌క్తిగానే గుర్తింపు ఉంది. కానీ ఆయ‌న‌కు ఊహించ‌నంత వీరాభిమానులూ వున్నారు కూడా!

అయితే వ‌చ్చిన చిక్క‌ల్లా నాలుగు దేశాల్లో తిరిగి, మ‌న దేశంలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతుండ‌డంతో పాల్‌గారికి రాజ‌కీయ ప‌రిస్థితుల మీద  ఎంతో అవ‌గాహ‌న వుంద‌న్న న‌మ్మ‌కం గ‌ట్టిగా ఏర్ప‌డిపోయింది. .అందువ‌ల్ల తాను ప్ర‌స్తుత రాజ‌కీయ‌ప‌రిస్థితుల్లో పెను మార్పు త‌న‌తోనే సాధ్య‌ప‌డుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని విపరీతంగా పెంచేసుకుని దానిని  బాగా ప్ర‌చా రం చేస్తున్నారు. రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవ‌డానికి అనాదిగా ఎంద‌రో నానా తంటాలు ప‌డు తూనే వున్నా రు. బ‌హు త‌క్కువ‌మందికే అది సాధ్య‌ప‌డింది. కానీ అంత క‌ష్ట‌ప‌డ‌న‌వ‌స‌రం లేద‌ని, చులాగ్గా చేసుకోవ చ్చ‌ని పాల్‌గారి వువాచ‌. అది తాను చేసి చూపుతాన‌ని అంటున్నారు.

ఇప్పుడు ప్ర‌జాశాంతి పార్టీ నాయ‌కుని గురించిన చ‌ర్చ బాగానే సాగుతోంది. అందుక్కార‌ణం వ‌చ్చే ఎన్ని క‌ల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో   ఒక‌టి రెండూ కాదు ఏకంగా 42 ఎంపీ స్థానాలు సాధించుకునే స‌త్తా త‌న‌కే వుంద‌ని ప్ర‌క‌టించ డం. దేశంలో పోనీ రెండు రాష్ట్రాల్లో ఎవ‌ర‌యినా గెల‌వాల‌నుకుంటే త‌న‌ పార్టీ స‌భ్య‌త్వం తీసుకుని త‌న సూక్తులు వింటే చాలు అమాంతం ఏది కావాలంటే అది అయిపోవ‌చ్చ‌ని ఆయ‌నే అన్నారు. ఇది విని అమాంతం రాజ‌కీయ‌ పార్టీల‌ వారు, నాయ‌కులు హ‌తాశులు కాలేదు గానీ ఇంకా న‌వ్వుకుంటూనే వున్నారు. ఇంత హాస్యం ఏ సినిమా ఇన్నాళ్లూ అందించ‌క‌లేకపోయిందని స‌ద‌రు సినీ జ‌నాలు భావించుకోవ‌చ్చు. అస‌లు ఆయ‌న‌కు ఎంపీ స్థానాలు, ఎన్నిక‌ల వ్య‌వ‌హ‌రాల గురించి ఆట్టే తెలియ‌క పోవ‌డాన్ని అమాయ‌క‌త్వమే అనుకోవాలా? లేక తానేం చెప్పినా సువార్త విన్నట్లే వింటారన్న అతి విశ్వాసం అనుకోవాలా?

ప‌వ‌ర్‌ స్టార్‌గా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సంపాదించుకున్న ఫాన్ ఫాలోయింగ్ అంతా యింతా కాదు. ఆయ‌నా పార్టీ పెట్టి రెండేళ్లుగా రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను క్షుణ్ణంగా గ‌మ‌నిస్తున్నాడు. అలాంటి అప్‌క‌మింగ్ రాజ‌కీయ నాయ‌కు డిని  త‌న పార్టీలో చేరి నీ రాజ‌కీయ జీవితానికి ఒక అర్ధం క‌ల్పించుకోమ‌ని కె.ఎ.పాల్ ఆహ్వానించ‌డం ఏమిటి?  తాను అనుకోవడమే కాదు, అస‌లు 2024లో ఏకంగా దేశ ప్ర‌ధానిని అవుతాను, అందుకే నాతో క‌ల‌వ‌మ‌ని  ప‌వ‌న్‌ని పిలుస్తున్నాడు పాల్‌.

అంతే కాదు ప‌వ‌ర్‌స్టార్ వీరాభిమానుల కోసం స్టార్‌ను ఆంధ్రా సి.ఎం చేద్దా మ‌ని, అందులో త‌ప్పూ, ఇబ్బందీ లేద‌ని  ప‌వ‌ర్ ఫాన్స్‌కి వినిపించేలా చెప్పారు.  పాల్‌ది అమాయక‌త్వ మా, పిచ్చా, మ‌రేమిటన్న‌ది ఆయ‌న అనుచ‌రులూ తెలుసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చి ప‌డింది.  ఎందుకంటే సుదీర్ఘ రాజ‌కీయానుభ‌వం వున్న, సీఎంగా ఎంతో అనుభ‌వం వున్న టిడిపి నేత చంద్ర‌బాబు నాయుడుని ఈసారి త‌మ‌కు సాయ‌పడమ‌ని అడుగు తున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ ద‌శ‌లో  కె.ఎ.పాల్  హెచ్చ‌రిక‌తో కూడిన ఆహ్వానాన్ని ప‌వ‌న్ ఎలా, ఎందుకు ప‌ట్టించుకుంటారు? నవ్వేసి ఊరుకుంటారు తప్ప.