TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ ఆఫీసులో సంబరాలు... కానీ...

Published on: Sun Nov 8, 2015 8:57AM

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్దిసేపటికే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ముందంజలో వుంది. దాంతో బీజేపీ వర్గాలు పట్టలేని ఆనందంతో పాట్నాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాయి. విజయోత్సాహంతో కేకలు వేస్తూ, ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకుంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హడావిడి చేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఎన్డీయే కూటమి కంటే మహా కూటమి ముందంజలోకి రావడంతో అందరూ మళ్ళీ చల్లబడ్డారు.