TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళలపై పోలీసు అధికారి దాడి.. కెమెరా కంటికి చిక్కిన దృశ్యాలు

Published on: Fri Apr 29, 2016 6:24PM


అధికారం చేతిలో ఉంది కదా అని ఈ మధ్య కొంతమంది తమ ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు. ఇప్పుడు బీహార్ లో కూడా ఓ పోలీసు అధికారి మహిళలపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మ‌ద్య‌మాల్లో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. బీహార్ రాజ‌ధాని పాట్నాలోని ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లోని భూమిలో కొందరు గుడిసెలు వేసుకుని నివ‌సిస్తున్నారు. అయితే ఆస్థలం నుండి వారిని ఖాళీ చేయించడానికి ఒక బిల్డర్ త‌న అనుచ‌రుల‌తో వారిపై దాడికి దిగాడు. దీంతో అక్కడ ఉంటున్నవారు కూడా తిరిగి వారిపై దాడికి దిగారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో సదరు బిల్డర్ తరపు అనుచరులు పారిపోయారు. దీంతో పోలీసులు అక్కడ ఉంటున్న వారిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే ఓ పోలీసు అధికారి మహిళపై చేయి చేసుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. త‌రువాత సోష‌ల్ మీడియాలోకి ఎక్కేశాయి. అంతే మ‌హిళ‌పై అనుచితంగా ప్ర‌వ‌ర్తించి, చేయి చేసుకున్న పోలీసు అధికారిపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.