TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక్క ట్వీట్.. 26 మందిని కాపాడింది.

Published on: Sat Jul 7, 2018 1:26PM

 

పక్క వాళ్ళకి ఏం జరిగితే మనకెందుకు అనుకునే ఈ రోజుల్లో.. తోటి ప్రయాణికులు ఆపదలో ఉన్నారని గ్రహించి, ఓ వ్యక్తి తన వంతు సహాయం చేసాడు.. 26 మందిని కాపాడాడు.. ఆదర్శ్‌ శ్రీవాస్తవ అనే వ్యక్తి ముజఫ‌ర్‌పుర్‌ నుంచి బాంద్రాకు వెళ్తున్న అవధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తుండగా.. తన బోగీలో ఉన్న 26 మంది మైనర్ బాలికలు ఇబ్బందిలో ఉన్నట్టు కనిపించారు.. కొందరు బాలికలు ఏడుస్తున్నారు.. దీంతో ఈ బాలికలను అక్రమంగా తరలిస్తున్నారేమో అని సందేహం వచ్చి.. శ్రీవాస్తవ, బాలికల పరిస్థిని గురించి వివరిస్తూ రైల్వేశాఖకు ట్వీట్ చేసాడు.. అధికారులు కూడా వెంటనే స్పందించారు.. ఇద్దరు ఆర్‌పీఎఫ్‌ జవాన్లు సాధారణ ప్రయాణికుల్లా కప్తాన్‌గంజ్‌లో ఆ రైలు ఎక్కి.. 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు కలిగిన మొత్తం 26 మంది బాలికలను కాపాడారు.. అలానే వారి వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.. 26మంది బాలికలను కాపాడిన ఆదర్శ్ శ్రీవాస్తవపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.