మంత్రి పార్ధసారధిపై ఈసీ కి పిర్యాదు
Published on: Sun Jun 10, 2012 1:21PM
పాటశాల ప్రాధమిక విధ్యశాఖ మంత్రి పార్ధసారధి తిరుపతిలో ఉపాధ్యాయులతో ఎన్నికల సమావేశం నిర్వహించారని విపక్షాలు ఈసీకి పిర్యాదు చేశాయి. ఒక ప్రైవేట్ హోటల్లో ఉపాధ్యాయులను సమావేశ పరచటం వెనుక కాంగ్రెస్ అభ్యర్ధి ఎం. వెంకటరమణకు మద్దుతు ఇమ్మని కోరటం లాంటిదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మంత్రిగా ఉపాధ్యాయులతో సమావేశం కావటం అక్షేపించటం లేదనీ, కేవలం ప్రచార సమయంలో అనుమతి లేకుండా సమావేశం నిర్వహించటమే నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంటున్నాయి. అయితే తాను రాజకియదురుద్దేశంతో ఈ సమావేశం జరపలేదని మంత్రి అంటున్నారు. ఇటీవల మంత్రి ధర్మాన రామచంద్రాపురం పర్యటనలో చేసిన కులవ్యాఖ్యలపై స్పందించిన ఈసి ఆయన్ని హెచ్చరించింది. ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సీరియస్ గా పరిగణిస్తామని ప్రకటించింది. తాజాగా మంత్రి పార్ధసారధిని కూడా ఇరికించేందుకు విపక్షాల గట్టి ప్రయత్నలే చేస్తున్నాయి.


