అన్నాహెచ్చరికతో సమావేశాలు మరో 3 రోజులు
Published on: Tue Dec 20, 2011 2:45PM
న్యూ
ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలను మరో మూడు రోజుల పాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లోక్పాల్ బిల్లును ఆమోదించకపోతే నిరాహార దీక్షకు దిగుతానని చెప్పిన అన్నా హజారే, డిసెంబరు 27న జైల్ భరో చేపడుతానన్నారు. అన్నా హజారే ప్రకటనతో అప్రమత్తమైన ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలను మరో మూడు రోజులు పొడిగించింది.లోక్పాల్ బిల్లుపై ఈ సాయంత్రం కేంద్ర కేబినెట్ మంగళవారం రాత్రి 7.30 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలో లోక్పాల్ బిల్లుపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. మొత్తమ్మీద అన్నా హజారే డిమాండ్ చేసిన అంశాలన్నిటికీ సంబంధించి సింహభాగం ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం.మరోవైపు బిల్లు కోరల్లేని పాములా ఉంటుందన్న వార్తలు అప్పుడే తిరుగాడుతున్నాయి. ఐతే ఇటువంటి బలహీనమైన బిల్లును ప్రభుత్వం తీసుక వస్తే మాత్రం ప్రభుత్వంపై తిరగబడక తప్పదని అన్నా హజారే హెచ్చరించారు


