శీతాకాల సమావేశాల్లోనే లోక్పాల్ బిల్లు : చిదంబరం
Published on: Sat Dec 17, 2011 3:55PM
చెన్నై :పార్లమెం
ట్ శీతాకాల సమావేశాల్లోనే లోక్పాల్ బిల్లు ప్రవేశపెడుతామని కేంద్రహోంమంత్రి పి.చిదంబరం తెలిపారు. దీంతో పాటు ఆహారభద్రతా బిల్లు వంటి కీలక బిల్లులను కూడా ప్రవేశపెడుతామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు. ఆహార భద్రత బిల్లును మంత్రివర్గం ఆమోదిస్తుందని తాను భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. యూపీఏ ఎన్నో కీలక, ప్రగతిశీల పథకాలు చేపట్టిందని ఆయన చెప్పారు. అవన్నీ సోనియా ఆలోచనలేనని ఆయన కొనియాడారు.


