జన్యు మార్పిడి పంటలు వద్దు
Published on: Mon Oct 15, 2012 10:15AM
.png)
జన్యు మార్పిడి పంటలగురించి ఇంకా సమగ్రమైన చర్చలు జరగాలని , ఈ పంటలకు వ్యతిరేకంగా పార్లమెంటరీ కమిటీ నిర్ణయానికి తాను పూర్తి మద్దతు నిస్తానని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ తెలిపారు. అనేక దేశాల్లో పెద్దఎత్తున ఈ ఫంటలపై రైతుల, స్వచ్చంధ సంస్ధల నుండి నిరసన వ్యక్తమవుతున్నందున ధీన్ని కొనసాగించరాదని, వీటిపై జీవవైవిద్య నిపుణులు వెంటనే చర్చించి స్దానిక జీవవైవిద్యాన్ని కాపాడేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రముఖ వ్యవసాయసంస్కరణల నిపుణులైన స్వామినాధన్ సూచించారు. అభివృద్ధి చెందినా దేశాలు ఈ విషయమై తలెత్తుతున్న దుష్పరిణాలపై దుమ్మెత్తి పోస్తున్నాయన్నారు. దేశవాళీ విధానంతోనే హరిత విప్లవం కొనసాగించగలమని తెలిపారు. సేంద్రియ ఎరువుల వల్లనే కీటకాలను నాశనం చేయగలమని ఆయన అన్నారు.


