ఉభయ సభల్లో నోట్ల రచ్చ... వాయిదాల పర్వం


పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వేడి వేడిగా సాగుతున్నాయి. లోక్ సభలోనూ, రాజ్యసభలోనూ నోట్ల రద్దుపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌ సహా అన్ని పక్షాలు ఆందోళన కొనసాగించగా..లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

 

ఇక రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగుతుంది. విపక్ష సభ్యులు ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్‌ కురియన్‌ ఎంత నచ్చజెప్పినప్పటికీ వారు వినకపోవడంతో సభను వాయిదా వేశారు.