TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

Published on: Thu Nov 30, 2023 12:33PM

పార్లమెంట్  శీతాకాల సమావేశాలు డిసెంబర్  4  ప్రారంభమై  22వ తేదీ వరకూ సాగుతాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాటి నుంచీ పార్లమెంటు సీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియెట్ బులిటిన్ విడుదల చేసింది.

ఈ సమావేశాలలో కేంద్రం  18 బిల్లులను ప్రవేశ పెట్టాలని  నిర్ణయించింది. ఈ 18 బిల్లులలో రెండు జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లు, ఐపీసీ సవరణ బిల్లులు ఉన్నాయి.  అలాగే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్లను 107 నుంచి 114 కు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఈ సమావేశాలలోనే సభ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 వీటితో పాటు  2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై  చర్చ, ఓటింగ్  జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే  సమావేశాల ప్రారంభానికి ముందు డిసెంబర్  2న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్  జోషి తెలిపారు..