మోడీ ముందే టీడీపీ ఎంపీల నిరసన.... ఇబ్బందికి గురైన మోడీ..


కేంద్ర ప్రకటించిన బడ్జెట్ తో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీలు గత రెండు రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నిన్న సభల లోపల నిరసన తెలిపిన టీడీపీ ఎంపీలు.. ఈరోజు పార్లమెంట్ బయటకు వచ్చి నిరసన తెలిపారు. ఇక సభల్లో కూడా తన నిరసనను తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి నిరసన తెలుపుతూనే ఉన్నారు. అయితే ఉదయం సభలో మోడీ లేరు.. కానీ  ప్రధాని మోడీ సభలోకి వచ్చిన తరువాత కూడా, టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. మోడీ చూస్తుండగానే... మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మిత్ర ధర్మం పాటించండి... మిత్రులకి న్యాయం చెయ్యండి... దగా పడ్డ మా రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అంటూ, మరింత బిగ్గరగా నినాదాలు చేసారు. ఇక టీడీపీ ఎంపీల నినాదాలు చూసిన మోడీ కాస్త ఇబ్బందికి గురైనట్టే కనిపిస్తోంది. అయినా సరే మన ఎంపీలు నినాదాలు ఆపలేదు.దీంతో, సభ వాయిదా పడింది.

 

ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి, వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ టీడీపీ ఎంపీలను చర్చలకు పిలిచారు. కానీ మన ఎంపీలు మాత్రం చర్చలకు వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేశారు. విభజన హామీలపై స్పష్టత వస్తే తప్ప తాము చర్చలకు వచ్చేది లేదంటూ తేల్చిచెప్పినట్టు సమాచారం....ఇక వైసిపీ ఎంపీలు మాత్రం, ఉదయం ప్లకార్డులు పట్టుకుని కొంచెం సేపు వెల్ లో హడావిడి చేసినా, మోడీ వచ్చిన తరువాత కనిపించలేదు.