టీడీపీ ఎంపీల నిరసన...పిలక వేసుకుని, చిడతలు శివప్రసాద్

 

కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. బడ్జెట్ కేటాయింపులో ఏపీకి అన్యాయం చేసారంటూ.. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎప్పుడూ విచిత్రమైన వేషాలు వేస్తూ నిరసన తెలిపే టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈసారి కూడా వినూత్నంగా పార్లమెంట్ కు వచ్చారు.  తలకు వెంట్రుకలకు పిలక వేసుకుని, దానికో రిబ్బన్ కట్టుకుని, మెడలో పూలమాల, చేతిలో చిడతలు పట్టుకుని వచ్చి పాటలు పాడుతూ నిరసన తెలిపారు. టీడీపీ సభ్యులంతా గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతుంటే, "ఓం నమో నారా" అంటూ శివప్రసాద్ అటూ ఇటూ తిరుగుతూ హడావుడి చేశారు.