వేడెక్కిన పార్లమెంట్.. ఆవరణంతా ప్లకార్డులు, నినాదాలు

 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయో లేదో..వెంటనే ఆందోళనలు కూడా మొదలయ్యాయి. పట్టుమని ఒక్క నిమిషం కూడా సాగకుండా.. ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు మొదలు పెట్టాయి. ఇక టీఆర్ఎస్ ఎంపీలు విభజన హామీల అమలును, తెలంగాణలో రిజర్వేషన్ల కోటాను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. వీరికి తోడు...  తమిళనాడు ఎంపీలు కావేరీ నదీ జలాల సమస్యను లేవనెత్తుతూ పోడియంలోకి దూసుకెళ్లారు. శివసేనతో పాటు కాంగ్రెస్ సభ్యులు కూడా పోడియం వైపు వెళ్లడంతో సభ జరిగే పరిస్థితి లేదని భావించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను, ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు రాజ్యసభను వాయిదా వేశారు. ఆ తరువాత ఎంపీలంతా బయటకు వచ్చి గాంధీ విగ్రహం ముందు నినాదాలు చేస్తూ నిరసనలు కొనసాగించారు. దీంతో పార్లమెంట్ ఆవరణంతా ప్లకార్డులు, ఎంపీల నినాదాలతో హోరెత్తుతుంది.