రాజ్యసభలోనూ ఆంధ్రాకు అన్యాయం
Published on: Tue Mar 20, 2012 11:15AM
మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరిగిన అభ్యర్థుల ఎన్నిక విషయంలో కూడా ఆంధ్రా ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన రాష్ట్రం నుంచి కాంగ్రెస్, టిడిపి తరపున ఆరుగురు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఆరుగురిలో నలుగురు తెలంగాణా ప్రాంతానికి చెందినవారే కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్ళిన పాల్వాయి గోవర్ధన్, రేణుకాచౌదరి, రాపోలు ఆనందభాస్కర్ తెలంగాణా ప్రాంతానికి చెందినవారే. టిడిపి తరపున రాజ్యసభకు వెళ్లిన దేవేందర్ గౌడ్ తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవి, తెలుగుదేశం పార్టీనుంచి సిఎం రమేష్ సీమాంధ్రకు చెందినవారు. ఈ ఎన్నికల్లో నలుగురు తెలంగాణా ప్రాంతంనుంచి రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ తెలంగాణా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు తమ అసంతృప్తిని వెళ్ళగ్రక్కుతూనే ఉన్నారు. కాని ఆంధ్రానుంచి ఇద్దరు మాత్రమే రాజ్యసభకు ఎన్నికయినప్పటికి సీమాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులెవ్వరు నోరు మెదపకపోవడం విశేషం.


