TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Published on: Fri Mar 10, 2017 9:44AM

 

కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇప్పటి వరకు 12 వారాలు మాత్రమే ఉన్న ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచుతూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజ్యసభ నుండి ఆమోదం పొందిన ఈ బిల్లును ఆయన నిన్న లోక్ స్భలో కూడా ప్రవేశపెట్టారు. ఇప్పుడు లోక్‌సభ కూడా ఆమోద ముద్ర వేయడంతో బిల్లు అమలులోకి రానుంది. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... ఈ బిల్లు ద్వారా దేశ వ్యాప్తంగా 18 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని అన్నారు. కాగా ఈ బెనిఫిట్(సవరణ) బిల్-2016 ప్రకారం.. 26 వారాల సెలవు మొదటి రెండు బిడ్డలకు వర్తిస్తుంది. మూడు నెలల కంటే తక్కువ ఉన్న పిల్లలను దత్తత తీసుకుంటే 12 వారాల సెలవు ఇస్తారు. 50 మందికి మించి మహిళా ఉద్యోగులున్న సంస్థలు, కార్యాలయాల్లో శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రాన్ని తల్లి  నాలుగు సార్లు ఉపయోగించుకోవచ్చు.