Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పార్కింగ్ ఛార్జీ గంటలకు ఐదొందలు.. ముక్కుపిండి వసూలు..ఎక్కడో తెలుసా?
posted on: May 1, 2022 10:33AM
గంటకు ఐదోందలు.. ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రిలో డాక్టర్ ఫీజు అనుకునేరు..కాదు కాదు యాదగిరి గుట్టపై పార్కింగ్ ఫీజు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా యాదగిరి గుట్టను అపర తిరుమలగా తీర్చిదిద్దాలని భావించి ఆయలపునర్మిర్నానం చేపట్టి సకల హంగులతో యాదాద్రిని తీర్చిదిద్దిన అనంతర పరిస్థతి.
ఆలయ పునర్నిర్మాణం జరిగి దర్శనాలు ప్రారంభం అయిన తరువాత అపర తిరుమలలా సీఎం తీర్చి దిద్దిన యాదగిరి గుట్ట అలియాస్ యాదాద్రి అసలు బాగోతం బయటపడలేదు. పెద్ద సంఖ్యలో వచ్చే యాత్రికులకు కనీస వసతులు కరవై కొండపై (గుట్ట) నానా యాతనలకూ గురవుతున్నారు. కనీసం శౌచాలయాలు కూడా గట్టపై లేవంటే అపర తిరుమల అంటున్న యాదాద్రిలో వాస్తవం ఏమిటో అవగతమౌతుంది.
ఇక యాదాద్రిశుని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికుల వామనాలకు కొండపైకి అనుమతించేదే లేదని తొలుత బీష్మించినా..అన్ని వైపుల నుంచి వ్యక్తమైన వ్యతిరేకతకు జడిసి వాహనాలను అనుమతించాలని సర్కార్ నిర్ణయించింది. అయితే కొండ మీద పార్కింగ్ కు నిర్ణయించిన రేట్లే.. వేసవి ఎండలను మించి మండిపోతున్నాయి. కొండపై వాహనం పార్కింగ్ గంటకు రూ.500గా నిర్ణయించారు.
ఆ తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చార్జి చేస్తారు. ఈ ధరలు ఆదివారం నుంచి అమలులోకి వచ్చాయి, ప్రొటోకాల్, దాతల వాహనాలకు మినహాయింపు ఉంటుంది, అది వేరే సంగతి. ఈ పార్కింగ్ చార్జీలపై భక్తులు మండి పడుతున్నారు. ఆలయ పునర్నిర్మాణ వ్యయం మొత్తం పార్కింగ్ ఫీజుల ద్వారా వసూలు చేద్దామనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.






