ఓటమిని అంగీకరించిన ప్రకాశ్ సింగ్ బాదల్..
Published on: Sat Mar 11, 2017 2:12PM

పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో కాంగ్రెస్ 70 స్థానాలకు పైగా గెలుపొంది అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ గెలిచినా.. పార్టీ మాతర్ం ఓటమి పాలైంది. ఈ సందర్బంగా ఆయన తమ పార్టీ ఓటమిని అంగీకరించారు. రేపు రాజీనామా చేస్తానని.. గవర్నర్ కు రాజీనామా లేఖ అందిస్తానని చెప్పారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.


