TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష.. పోలీసుల ఎంట్రీతో తీవ్ర ఉద్రిక్త‌త‌..

Published on: Mon Feb 7, 2022 11:51AM

ప‌రిటాల శ్రీరామ్ రంగంలోకి దిగారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దును నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగారు. జ‌గ‌న్ స‌ర్కారు కొత్త ప్ర‌తిపాద‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఎమ్మార్మో కార్యాలయం ఎదుట ఆందోళన చేప‌ట్టారు. ప‌రిటాల దీక్ష‌తో అనంత‌లో ఒక్క‌సారిగా అటెన్ష‌న్ నెల‌కొంది. టీడీపీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం వ‌చ్చింది. ఎప్ప‌టిలానే వైసీపీ వాళ్లు పోలీసుల‌ను ముందుంచ‌డంతో హైటెన్ష‌న్ క్రియేట్ అయింది. 

ఉదయం ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకులు సృష్టించారు. ఎమ్మార్వో కార్యాలయం ద‌గ్గ‌ర‌ వేసిన దీక్షా ప్రాంగణం టెంట్లను తొలగించారు. చిన్నపాటి వేదికను ఏర్పాటు చేసుకోవాలంటూ టీడీపీ నేతలకు పోలీసులు సూచించారు. అయితే, పోలీసుల ఆంక్ష‌ల‌ను లెక్క చేయ‌కుండా ప‌రిటాల శ్రీరాం నిరాహార దీక్ష‌కు దిగారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి.. ప‌రిటాల‌కు మ‌ద్ద‌తుగా దీక్ష‌లో కూర్చున్నారు.

జిల్లాల పునర్విభజన, ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేయడం ఆటవిక విధానంగా ఉందన్నారు. ఏసీ రూముల్లో కూర్చుని విజయవాడలో నిర్ణయం చేయడం సమంజసం కాదన్నారు. ప్రజలకు ఏది అనుకూలమో కూడా ఆలోచించాలని.. ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు వల్ల 8 మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఎక్కడ కళ్యాణదుర్గం.. ఎక్కడ రామగిరి... కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌లో రామగిరి ఏ విధంగా కలుపుతారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెవెన్యూ డివిజన్‌లో మార్పు జరిగిందని పరిటాల శ్రీరామ్ మండిప‌డ్డారు.