TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వచ్చేఎన్నికల్లో పోటీకి పరిటాల శ్రీరామ్ రెడీ

Published on: Mon Sep 22, 2014 4:12PM

 

మరో రాజకీయ వారసుడు రంగంలోకి దిగబోతున్నారు. పరిటాల రవి, పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఎన్నికల బరిలోకి దూకడానికి సిద్ధంగా వున్నారు. తన కుమారుడు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తాడని, తాను పోటీకి దూరంగా వుంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత వెల్లడించారు. పరిటాల కుటుంబం పేరుతో బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న శ్రీరామ్ అనంతపురం రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నట్టు పరిటాల సునీత చెప్పారు.