పరిటాల హత్యకేసుపై 'దేశం'లో కదలిక
Published on: Sat Jun 2, 2012 9:37AM
అనంతపురం ఎమ్మెల్యే పరిటాల రవి హత్యకేసులో అనుమానితునిగా పేరుబడిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రమేయం గురించి తిరిగి విచారణ జరపాలని ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత డిమాండ్ చేస్తున్నారు. ఆమె తన డిమాండుకు ప్రభుత్వం స్పందన కోరుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసి పోలీసుల వ్యక్తిగత పూచీకత్తుపై వదిలారు. ఈ సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమస్య తీవ్రరూపం దాలుస్తున్నందున తామూ జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని భావించింది. అందుకే తప పార్టీ అధినేత దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆయన అనుమతితో సిఎంను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసలు ఈ కొనలో ఎందుకు దర్యాప్తు చేయకూడదు, అప్పట్లో వై.ఎస్. సిబీఐ ను మేనేజ్ చేసి ఉండవచ్చు కదా అన్న కోణంలో సిఎంతో చర్చించటానికి దేశం నేతలు ఉద్యుక్తులయ్యారు. బాబు అనుమతి ఇంకా లభించనందున వారు వేచి చూస్తున్నారన్న సమాచారం.


