సూట్ కేస్ బాంబు కేసులో మంగలి కృష్ణకు ఐదేళ్లు జైలు శిక్ష
Published on: Wed Apr 25, 2012 5:04PM
2001లో పరిటాల రవి హత్యకు కుట్ర పన్ని సూట్ కేస్ బాంబు పెట్టిన కేసులో మంగళి కృష్ణకు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మంగళి కృష్ణ ఎ-5 నిందితుడిగా ఉన్నారు. కృష్ణతో పాటు ఎ-2గా ఉన్న రామచంద్రా రెడ్డి, ఎ-3గా ఉన్న రవీంద్రా రెడ్డి, ఎ-4గా ఉన్న సుధీర్ రెడ్డికి కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. కోర్టు తీర్పుపై పరిటాల రవి అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళి కృష్ణతో పాటు మిగిలిన ముగ్గురికి ఐదు సెక్షన్ల క్రింద కోర్టు శిక్ష ఖరారు చేసింది. 120బి, మారణాయుధాలు కలిగిన చట్టం, ఎపిపిఎస్ యాక్ట్ 3, 4, 5 సెక్షన్ల క్రింద వారికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది.


