Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్యారిస్‌లో మళ్ళీ కాల్పులు
posted on: Nov 18, 2015 9:52AM

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో మళ్ళీ కాల్పుల కలకలం రేగింది. ఇటీవల ప్యారిస్ నగరంలో ఐసీస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించి 128 మందిని హతమార్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్యారిస్ నగరాన్ని పోలీసులు జల్లెడ పడుతూ ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్యారిస్ ఉత్తర ప్రాంతంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు కొందరు అనుమానిత వ్యక్తులపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తులు, పోలీసుల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.






