TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విద్యార్థుల ప్రాణాలతో నేతల చెలగాటం?

Published on: Mon Oct 1, 2012 7:57AM

Parents In Dilemma,  Political Leaders, Using Students, TRS, KCR, Rakeup, Suicides, University, Government, Osmania University Students, Seperate Telangana

 

 

 

పాములకు కోరల్లోనే...రాజకీయనాయకులకు ఒళ్లంతా విషం అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.  చదువుకునే వయస్సు నుంచి రాజకీయాలు నేర్చుకోవాలనుకోవటం పొరబాటు కాదు. కానీ, చదువును  పక్కనపెట్టి రాజకీయాలకు యువకులను అలవాటు చేయటం బాధ్యతారాహిత్యమని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రత్యేకించి విద్యార్థుల ప్రాణాలను బలిపెట్టి తమ సమస్యలను సాధించుకునేందుకు నేతలు కృషి చేస్తున్నారని వారు బహిరంగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్రికల్లో తమ ఆందోళన కుండా తెలంగాణావాదులు అడ్డుపడుతున్నారని వీరు బాధపడుతున్నారు. ఒక  ప్రత్యేకరాష్ట్రం సాధించాలని దాని కోసం ఏర్పాటైన తెలంగాణా రాష్ట్రసమితి (టిఆర్‌ఎస్‌) తమ పిల్లలను రెచ్చగొడుతోందంటున్నారు. నేతలు చేసే ప్రసంగాలు నిజమని నమ్మి తమ ప్రాణాలను త్యజించే స్థాయికి విద్యార్థులు రెచ్చిపోతుంటే యూనివర్శిటీ యాజమాన్యం, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయంటున్నారు.  ఎనిమిదేళ్ల క్రితం టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ ప్రారంభించిన ఆందోళన మొదలుకుని ఇప్పటి దాకా నష్టపోయింది ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులేనని సామాజిక అథ్యయనవేత్తలు సైతం స్పష్టం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళనలో ఉన్న బాధను ఎవరూ గుర్తించటం లేదని వారు అభిప్రాయ పడుతున్నారు.

Parents In Dilemma,  Political Leaders, Using Students, TRS, KCR, Rakeup, Suicides, University, Government, Osmania University Students, Seperate Telangana

ప్రత్యేకరాష్ట్రం అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన అంశమైనా దాన్ని సీరియస్‌గా విద్యార్థులకు పరిమితం చేసేలా టిఆర్‌ఎస్‌ నాయకులు ప్రసంగిస్తున్నారని అంటున్నారు. ఆ పార్టీ అధినేత కేసిఆర్‌ ఓసారి తన ప్రకటనలో ఆత్మత్యాగం చేసైనా తెలంగాణా గౌరవాన్ని కాపాడాలని విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. ఈ పిలుపు వందలాది మంది విద్యార్థుల పీకల మీదకు తెచ్చింది. కొందరైతే ప్రాణత్యాగాలు కూడా చేశారు. ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం విలిపించారో కూడా పట్టించుకోకుండా తన ప్రకటనను  కేసిఆర్‌ సమర్ధించుకున్నారు. అంతేకాకుండా, ఇప్పటికీ కేసిఆర్‌ తన పర్యటనలకు ముందు, వెనుక విద్యార్థులతో ముడిపెట్టుకుంటున్నారు. ఇది ఇంకా ఎంత మంది కొంప ముంచుతుందో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. తాజాగా తెలంగాణా జెఎసి ప్రకటించిన మార్చ్‌ఫాస్ట్‌ కూడా ఉస్మానియా విద్యార్థులను రెచ్చగొడుతోంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీని రణరంగం చేశారు. పోలీసులతో విద్యార్థులు ఒక యుద్ధమే చేశారు. దీంతో తల్లిదండ్రులు ఏ చెడు వార్త వినాల్సివస్తుందో అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు. ఇలానే ప్రతీ ఏడాది ఓ ఐదు, ఆరుసార్లు ఈ యూనివర్సిటీ ఉద్రిక్తప్రాంతంగా మారుతోంది. ఈ తెలంగాణా ఊసే పట్టని అమాయక విద్యార్థులు కూడా ఈ ఉద్యమాల వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇకనైనా ఇటువంటి దారుణకాండకు తెలంగాణామార్చ్‌ తరువాత స్వస్తి పలికితే బాగుంటుందని ఉస్మానియా విద్యార్థుల తల్లిదండ్రులు చేతులు ఎత్తి కోరుతున్నారు.