పోటీప్రభుత్వం నడుపుతున్న ధర్మవరం ఎమ్మెల్యే
Published on: Thu May 3, 2012 10:05AM
ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి తీరే వేరు. తన నియోజకవర్గంలో ఏమి జరిగినా తన కనుసన్నల్లోనే జరగాలని ఆయన కోరుకుంటారు. అలాగే సామాన్యులకు సంక్షేమ పథకాలు దక్కాలంటే అది పూర్తిగా ధర్మవరం ఎమ్మెల్యే దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. చేనేత కార్మికులకు, రైతులకు, మహిళలకు ఎవరికీ ఎటువంటి లబ్ది దక్కాలన్నా వారు ముందుగా వెంకటరామిరెడ్డికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులపై ఎమ్మెల్యే సంతకం ఉంటేనే అధికారులు స్వీకరిస్తున్నారు. ఆయన సంతకం ఉన్నవాటికే అధికారులు రుణాలు, పెన్షన్లు, సబ్సిడీలు మంజూరు చేస్తున్నారు. ఇది నిబంధనలు విరుద్ధ మైనప్పటికీ గత ఏడాది కాలంగా ధర్మవరం శాసనసభ్యుడు వెంకటరెడ్డి హవా కొనసాగుతూనే ఉంది. ఈ విధానాన్ని టిడిపి నాయకులు, కార్యకర్తలు కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఆయన కూడా ఏమీ పట్టించుకోకపోవటం విశేషం.


