TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పరకామణి కేసులో సూత్రధారి...పాత్రధారి భూమాననే : మంత్రి అనగాని

Published on: Mon Dec 1, 2025 5:28PM

 

తిరుమల శ్రీవారి ఆలయంలో చోరీకి సంబంధించి విచారణ జరుగుతున్న పరకామణి కేసులో సూత్రధారి, పాత్రధారి వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డినేనని తిరుపతి జిల్లా ఇంఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పరకామణి కేసులో అతి త్వరలో విచారణ నివేదిక ఇస్తారని, నిందుతులెవరో తెలిసిపోతుందని అన్నారు. 

దేవుడి సోమ్మును దొంగతనం చేసిన వ్యక్తిని కాపాడేందుకు రాజీ చేయడం చరిత్రలో వినని, చూడని విషయమని అన్నారు. పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి ఉండబట్టే ఆ కేసు విచారణపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. దేవుడి అంటే ఎటువంటి నమ్మకం లేని కరుణాకరెడ్డి పింక్ డైమండ్, గోశాలతోపాటు ఇతర అంశాలపై అబద్దాలు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. పరకామణిలో చోరి చేసిన  దొంగ నుండి ఆస్తుల బదలాయింపు కరుణాకరెడ్డికే జరిగిందన్నారు. 

కల్తీ నెయ్యి కేసులోనూ తప్పు జరిగినట్లు విచారణలో అందరూ అంగీకరించారని, కానీ తప్పు మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని అన్నారు. కానీ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని అన్నారు.  రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ వ్యవహారంలో స్థానిక డీఐజీది ఏమైనా తప్పుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.