పరకాలలో పోటే చేయనున్న టిఆర్ఎస్ పార్టీ
Published on: Tue Apr 17, 2012 11:01AM
సోమవారం తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో పరకాల ఉప ఎన్నికలపై చర్చించి, పరకాల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలని టిఆర్‌ఎస్ నిర్ణయించింది. పరకాల నుంచి పోటీ చేయాలని తమ పార్టీ నిర్ణయించిందని పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేతలు టి హరీష్‌రావు, నాయిని నరసింహారెడ్డి మీడియాకు వెల్లడించారు. హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ పరకాల నుంచి ఎవరు పోటీ చేసినా టిఆర్‌ఎస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పరకాల స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయడానికి పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నరసింహారెడ్డి నేతృత్వంలో కమిటీ వేసినట్టు ఆయన తెలిపారు. కమిటి నుంచి నివేదిక అందిన వెంటనే అభ్యర్థిని ప్రకటిస్తామని హరీష్‌రావు తెలిపారు. పార్టీ 11వ వార్షికోత్సవాన్ని బహిరంగ సభగా కాకుండా, ప్రతినిధుల సమావేశంగా నిర్వహించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందని ఆయన తెలిపారు.


